కాబూల్ పేలుడు: ఆంధ్ర అధికారి మృతి
కాబూల్: కాబూల్ లో జరిగిన పేలుడులో ఆంధ్రా అధికారి వివి రావు మృతి చెందారు. మృతుల్లో నలుగురు భారతీయులున్నారు. ఈ పేలుడులో మరణించిన ఐఎఫ్ ఎస్ అధికారి వీవిరావు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మొవ్వ ప్రాంతానికి చెందినవారు. కారు బాంబు పేలుడులో మొత్తం 41 మంది మరణించారు. ఈ దాడిలో 28 మంది మరణించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. రెండు కార్లు భారత రాయబార కార్యాలయంలోకి ప్రవేశిస్తుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడి తీవ్రతకు రాయబార కార్యాలయం భవంతి లోపలి భాగం దెబ్బ తిన్నది.
మృతుల్లో నలుగురు భారతీయులున్నట్లు భారత రాయబారి జయన్ ప్రసాద్ చెప్పారు. వీరిలో బ్రిగేడియర్ ఆర్. మెహతా ఉన్నారు. ఈ దాడి జరిగిన వెంటనే విదేశాంగ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రణబ్ ముఖర్జీ రక్షణ మంత్రి ఎకె ఆంటోనీతో, సీనియర్ అధికారులతో చర్చలు జరిపారు. ఈ దాడిని పిరికిపందల చర్యగా భారత్ అభివర్ణించారు. ఈ దాడి నేపథ్యంలో కాబూల్ కు భారత ఉన్నత స్థాయి బృందం ఒక్కటి బయలుదేరింది. అఫ్ఘనిస్తానులో 3 వేల మందికి పైగా భారతీయులు పనిచేస్తున్నారు.












Click it and Unblock the Notifications