ఎమ్మెల్యే హరీష్ రావు అరెస్టు
సిద్ధిపేట: ఎరువుల కొరతకు నిరసనగా మెదక్ జిల్లా సిద్ధిపేటలో ఆందోళన చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావును పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హరీష్ రావు అరెస్టును నిరసిస్తూ తెరాస కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసుసు వారిపై లాఠీచార్జీ చేశారు.
ఎరువుల కొరతపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల కార్యకర్తలు, రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మినహా ఎక్కడా ఎరువుల కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి చేసిన ప్రకటనపై రైతులు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications