చిరుపై పోటీకి సిద్ధం: రాజశేఖర్

ఎంతో మంచి పార్టీ అయిన కాంగ్రెసులో చేరడం ద్వారా ప్రజలకు సేవ చేయగలుగుతామనే నమ్మకం ఉందని రాజశేఖర్ అన్నారు. తాము పార్టీ నుంచి ఏ విధమైన పదవులు ఆశించడం లేదని జీవిత చెప్పారు. తాము పార్టీలో చేరడానికి ఏ విధమైన డిమాండ్లు పెట్టలేదని ఆమె చెప్పారు. పార్టీ అప్పగించే పనులు సక్రమంగా, నిబద్ధతతో చేస్తామని రాజశేఖర్ చెప్పారు. కాంగ్రెసులో ఎప్పుడు చేరుతారని రాష్ట్రంలోని ప్రజలంతా అడుగుతున్నారని, మంచి పార్టీ అయిన కాంగ్రెసులో చేరడం అవసరమని భావించామని రాజశేఖర్ అన్నారు. జీవిత కాంగ్రెసులో చేరాలని ప్రజలు భావించారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications