కాశ్మీర్ లో జగపతిబాబు యూనిట్ పై దాడి

దాడి విషయాన్ని సినిమా యూనిట్ హైదరాబాదులోని సౌభాగ్య మీడియాకు తెలియజేశారు. తామంతా సురక్షితంగా ఉన్నామని, అంతా ఒక చోటే ఉన్నామని, హోటల్ కే పరిమితమయ్యామని జగపతిబాబు ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో ఫోన్ లో చెప్పారు. తాము రేపు హైదరాబాదు వస్తున్నట్లు, తమకు సహకరించడానికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐజి ఒకరు తమతో ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, రాళ్లు రువ్వుకుంటున్నారని, కాల్పులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. సినిమా షూటింగ్ ఇంకా 20 శాతం మిగిలి ఉందని ఆయన చెప్పారు.
జొన్నలగడ్డ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటిస్తోంది. కాశ్మీర్ లో రెండు పాటల చిత్రీకరణకు యూనిట్ ఆరు రోజుల క్రితం వెళ్లింది. ఇప్పటి వరకు షూటింగ్ సక్రమంగానే జరిగింది. అయితే మంగళవారం యూనిట్ పై దాడి చేసింది. జగపతి బాబుతో పాటు జొన్నలగడ్డ శ్రీనివాస్, మీరా జాస్మిన్ అక్కడే ఉన్నారు. దాదాపు 30 మంది యూనిట్ లో ఉన్నారు. దాడి జరగగానే యూనిట్ సభ్యులను పోలీసులు హోటల్ కు చేర్చారు. జొన్నలగడ్డ శ్రీనివాస్ గతంలో జగపతిబాబుతో జగపతి సినిమా తీశారు. ప్రస్తుత సినిమాకు ఇంకా పేరు ఖరారు కాలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
