హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశ ప్రకటన ముహూర్తం మొత్తానికి ఖరారైంది. అయితే ఈ పక్రియను రెండు భాగాలుగా విభజించి అమలు చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. మొదటిది తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు చిరంజీవి స్పష్టమైన ప్రకటన చేయటం,రెండవది పార్టీ పేరు,జెండా,అనుసరించే సిద్దాంతాలు,విధివిధానాలు ప్రజల మధ్య బహిరంగ ప్రకటన చేయటం .ఇక చిరు ఈ నెల 17న తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లుగా మీడియా ప్రతినిధుల సమక్షంలో ముందుగా కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ ఆఫీసులో ప్రకటిస్తారు.అలాగే ఈ నెల 26న తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీ పూర్తి వివరాలు వెళ్ళడిస్తారు. ఈ మేరకు అభిమానులను సిధ్ధం కావాల్సిందిగా అభిమానులకు సందేశఆలు వెళ్తున్నాయి.