పవన్ కళ్యాణ్ కు విడాకులు మంజూరు

Pawan Kalyan
విశాఖపట్నం: సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ కు భార్య నందినితో విడాకులు మంజూరయ్యాయి. ఇరువురి రాజీ మేరకు ఫ్యామిలీ కోర్టు మంగళవారం సాయంత్రం పవన్ కళ్యాణ్, నందినిలకు విడాకులు మంజూరు చేసింది. ఇరు పక్షాల మధ్య రాజీ యత్నాలు ఫలించడంతో విడాకులు మంజూరయ్యాయి. పవన్ కళ్యాణ్ తో పాటు నందిని మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. నందిని డూపులు ఆరు కార్లలో కోర్టుకు వచ్చారు. ఈ రకంగా కోర్టు వద్ద హైడ్రామా నడిచింది. మంగళవారం 3 గంటల 5 నిమిషాలకు వారికి విడాకులు మంజూరయ్యాయి. హైకోర్టులో వేసిన బహుభార్యాత్వం కేసు క్రిమినల్ రివిజన్ పిటిషన్ ను ఇప్పటికే నందిని ఉపసంహరించుకున్నారు. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో విడాకులు మంజూరయ్యాయి. నందిని మీడియా ముందుకు రాలేదు.

వాస్తవానికి ఈ నెల 22వ తేదీన నందిని దాఖలు చేసిన మనోవర్తి కేసు విచారణకు రావాల్సి ఉంది. అయితే ఇరు పక్షాలు రాజీకి రావడంతో విచారణను ప్రీపోన్ చేసేందుకు కోర్టు అంగీకరించి మంగళవారం విచారణ చేపట్టింది. నందినికి ఐదు కోట్ల రూపాయల మనోవర్తిని చెల్లించేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించారు. దానికి నందిని కూడా అంగీకరించారు. ఈ నెల 17వ తేదీన చిరంజీవి పార్టీని అధికారికంగా ప్రకటించనున్న నేపథ్యంలో రాజీకి పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. వ్యక్తిగత వివాదాలు ఉంటే పార్టీకి ఇబ్బందులవుతాయనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తన విడాకుల వివాదాన్ని పరిష్కరించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+