మద్దూరు ప్రమాదం: మృతులు 22 మంది
గుంటూరు: గుంటూరు జిల్లా మద్దూరు వాగులో లారీ కొట్టుకుపోయిన ప్రమాదంలో సంభవించిన మృతుల సంఖ్య 22కు చేరుకుంది. మంగళవారంనాడు మరో 9 మృతదేహాలను వాగు నుంచి వెలుపలికి తీశారు. దీంతో మృతుల సంఖ్య 22కు చేరుకుంది. మరో నలుగురి ఆచూకీ దొరకాల్సి ఉంది. మిగిలినవారి కోసం వాగులో గాలింపు చర్యలు సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం గాలింపు ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు.
రెండు రోజుల క్రితం మద్దూరు వాగులో లారీ కొట్టుకుపోవడంతో 26 మంది గల్లంతయ్యారు. అయితే గల్లంతైన వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, లారీ డ్రైవరును పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాద సంఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి సోమవారం సందర్శించారు. మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు.












Click it and Unblock the Notifications
