జమ్మూకాశ్మీర్ కాల్పుల్లో ఐదుగురు మృతి

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం జరిగిన ఘర్ణణల్లో ఐదుగురు మృతి చెందారు. ఆందోళనకారులు కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించడంతో సైన్యం జరిపిన కాల్పుల్లో బండిపురాలో ముగ్గురు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. శ్రీనగర్ శివారులోని లాస్జాన్ ప్రాంతంలో జరిగిన తాజా ఘర్షణల్లో మరో ఇద్దరు మరణించారు.

సోమవారం జరిగిన కాల్పుల్లో హురియత్ నాయకుడు షేక్ అబ్దుల్ అజీజ్ మృతికి నిరసనగా స్థానికులు మంగళవారం వీధుల్లోకి వచ్చారు. దీంతో ఘర్షణలు చెలరేగాయి. అజీజ్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వీలు కల్పిస్తూ హురియత్ నేతలపై విధించిన గృహ నిర్బంధాన్ని ఎత్తేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. రెండో రోజు మంగళవారం కూడా శ్రీనగర్ లో కర్ఫ్యూ కొనసాగుతోంది. బారాముల్లా జిల్లా చాహల్ గ్రామంలో సోమవారం జరిగిన సైన్యం కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరిన హురియత్ నేత అజీజ్ మృతి చెందాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+