టిటిడి అధికారుల సస్పెన్షన్ పై ఆందోళన
తిరుపతి: శ్రీవారి డాలల్ల గల్లంతు వ్యవహారంలో ముగ్గురు అధికారుల సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఉద్యోగులు మంగళవారం ఆందోళనకు దిగారు. వారికి రాజకీయ నాయకులు బాసటగా నిలిచారు. కాంగ్రెస్ శాసనసభ్యుడు వెంకటరమణ కూడా వారికి బాసటగా నిలిచారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్యోగులకు మద్దతుగా నిలిచారు. టిటిడి పరిపాలనా భవనం ముందు ఉద్యోగులు ధర్నాకు దిగారు. సస్సెన్షన్ ను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. విజిలెన్స్ పాత నివేదికను వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు.
టిటిడి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఇవో ప్రభాకర్ రెడ్డి, డిప్యూటీ ఇవో వాసుదేవన్, ఆర్జితం ఆఫీస్ సూపరింటిండెంట్ రామచంద్రారెడ్డిలను సస్పెండ్ చేస్తూ టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణాచారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులకు ఉద్దేశించడానికి ఉద్దేశించిన 300 డాలర్లు గల్లంతైన విషయం 2006లో వెలుగులోకి వచ్చింది. దీనిపై ఇప్పటికే కౌంటర్ అసిస్టెంట్ వెంకటాచలపతిని సస్పెండ్ చేశారు. తాజాగా టిటిడి విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఆ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications
