లాటరీ తగిలితే కోట్ల బుట్టలో..
హైదరాబాద్: మధ్యతరగతి వైద్య దంపతులకు కోట్ల రూపాయల లాటరీ తగిలింది. పదిహేనేళ్ల క్రితం అశోక్, కీర్తి పటేల్ దంపతులకు సింగిల్ డిజిట్ పై లక్ష రూపాయల విలువ చేసే లాటరీ తప్పిపోయింది. కానీ ఇప్పుడు జులై 28వ తేదీన తంతే బూరెల బుట్టలో పడ్డట్లు లాటరీ కొంటే కోట్ల రూపాయలు తగిలాయి. కీర్తి కొన్న లాటరీ టికెట్టుకు 7 కోట్ల 87 లక్షల రూపాయలు తగిలాయి. దీంతో ఒక మధ్యతరగతి కుటుంబం కోట్లకు ఎగబాకింది. 39 ఏల్ల కీర్తిని ముంబయిలోని అతి పెద్ద జాక్ పాట్ విజేతగా చెప్పుకోవచ్చు.
పటేల్స్ కుటుంబాన్ని ప్లేవిన్ లాటరీ కంపెనీ బుధవారం మీడియాకు పరిచయం చేసింది. అయితే ఆ వైద్య దంపతులు మౌనంగా ఉండిపోయారు. ఈ నగరంలో జీవించడం చాలా ఖరీదైన విషయమని, ఇప్పటికే మూడు ఇళ్లు మారామని, బాంద్రాలో ఒక ఇల్లు కొనుక్కుంటామని, ఇది కల సాకారం కావడమని కీర్తి అన్నారు. జనరల్ ఫిజిషియన్ అయిన ఆమె ఇప్పుడు శాంతాక్రజ్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇద్దరు పిల్లలకు మంచి విద్యను అందిస్తామని, ప్రపంచ పర్యటన చేస్తామని ఆమె అన్నారు. తన వద్దకు వచ్చే రోగులకు ఫీజులు తగ్గిస్తానని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications
