మంగళూర్: కర్ణాటకలో మంగళూర్ సమీపంలో ఫల్గుణి నదిలో గురువారం ఉదయం స్కూలు బస్సు పడిపోయిన సంఘటనలో పదిహేను మంది విద్యార్ధులు మరణించారు. మరో 25 మంది ఆచూకీ తెలియడం లేదు. సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 7 గురిని రక్షించి ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు.
ఆ ప్రాంతానికి మొత్తం జిల్లా పాలన యంత్రాంగం తరలి వెళ్ళింది. సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే భారీ వర్షాల కారణంగా సహాయ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతోంది.