టిటిడి అధికారులపై సస్పెన్షన్ ఎత్తివేత
హైదరాబాద్: డాలర్ శేషాద్రిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)పాలక మండలి నిర్ణయం తీసుకుంది. చైర్మన్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షతను గురువారం జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. డాలర్ల కుంభకోణంలో శేషాద్రిని ఉద్యోగం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. కాగా, ముగ్గురు అధికారులపై విధించిన సస్పెన్షన్ ను కూడా ఎత్తివేయాలని పాలక మండలి నిర్ణయించింది.
డాలర్ల కుంభకోణంపై లోతైన విచారణ జరపాలని పాలక మండలి నిర్ణయించింది. ఇందుకు గాను జాయింట్ ఎగ్జిక్యూటివ్ అధికారి ధర్మారెడ్డిని విచారణాధికారిగా నియమించింది. అధికారుల సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల సంఘం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఉద్యోగుల ఆందోళనతో పాలక మండలి దిగి వచ్చింది.












Click it and Unblock the Notifications
