చిరంజీవి సంప్రదిస్తున్నారు: బిజెపి
న్యూఢిల్లీ: చిరంజీవి పొత్తు కోసం తమను సంప్రదిస్తున్నారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ ప్రకాశ్ జవేదకర్ చెప్పారు. చిరంజీవితో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు కూడా తమను సంప్రదిస్తున్నట్లు ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. చిరంజీవితో తమకు మంచి సంబంధాలే ఉంటాయని ఆయన అన్నారు.
పొత్తులపై తాము ఇప్పుడే ఏమీ చెప్పలేమని, ఎన్నికలు సమీపిస్తే గాని ఒక స్పష్టత రాదని ఆయన అన్నారు. చిరంజీవి మంగళవారంనాడు తమ పార్టీ నేత ఎల్. కె. అద్వానీతో మాట్లాడారని ఆయన చెప్పారు. చిరంజీవి తమను సంప్రదించడం సంతోషకరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
