అద్వానీకి చిరంజీవి ఫోన్
హైదరాబాద్: రాజకీయాల్లోకి ప్రవేశించిన మెగాస్టార్ చిరంజీవి మంగళవారం బిజెపి అగ్రనేత ఎల్.కె. అద్వానీతో ఫోనులో మాట్లాడారు. బిజెపికి చిరంజీవి దగ్గరవుతున్నారనే వార్తలకు ఇది బలం చేకూరుస్తోంది. అద్వానీ తనను ఆశీర్వదించారని చిరంజీవి మీడియా ప్రతినిధులతో చెప్పారు. అలాగే, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన చేగొండి హరిరామజోగయ్య మంగళవారం చిరంజీవి పార్టీలో చేరారు. హరిరామ జోగయ్య సమర్పణలో తన రాజకీయ రంగ ప్రవేశంపై రూపొందించిన ఆడియో క్యాసెట్ ను చిరంజీవి ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
పెద్దల అనుభవాన్ని తగిన విధంగా ఉపయోగించుకుంటామని చిరంజీవి చెప్పారు. పెద్దలను తాను స్వయంగా కలుస్తానని ఆయన చెప్పారు. తన జన్మదినం సందర్భంగా ఈ నెల 22వ తేదీన ఎవరూ హైదరాబాదుకు రావద్దని చిరంజీవి అభమానులను కోరారు. త్వరలో తాను అందరినీ కలుస్తానని ఆయన చెప్పారు. స్థానికంగా అభిమానులు ప్రజలకు సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. చిరంజీవి తనకు పుట్టినప్పటి నుంచి తనకు తెలుసునని హరిరామజోగయ్య చెప్పారు. పెళ్లి చూపులకు కూడా తాను వెళ్లానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
