శ్రీనగర్ ప్రశాంతం: జమ్మూలో కర్ఫ్యూ సడలింపు

జమ్ము: జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి కాస్తా మెరుగుపడింది. దీంతో రాష్ట్రంలోని కర్ఫ్యూ సడలించారు. జమ్మూ, సాంబా, ఉధంపూర్, కిష్ట్వర్ జిల్లాల్లో మంగళవారం కర్ఫ్యూ సడలించారు. జమ్మూ నగరంలో ఉదయం 5 గంటల నుంచి 15 గంటల పాటు కర్ఫ్యూ సడలించారు. సాంబాలో 9 గంటలు కర్ఫ్యూను సడలించారు.

కిష్త్వర్ లోని పరిస్థితిని ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. ఈ నెల 12వ తేదీన జరిగిన మత ఘర్షణల్లో ఇద్దరు మరణించారు. పలువురు గాయపడ్డారు. శ్రీ అమర్నాథ్ సంఘర్ష్ సమితి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం మూడో రోజు జైల్ భరో ఆందోళన్ జరిగింది. ఆందోళనకు మద్దతిస్తున్న అధికారులను వేధిస్తే తాము చర్చల్లో పాల్గొనబోమని సమితి కన్వీనర్ లీలా కరణ్ శర్మ చెప్పారు.

మూడు రోజుల పాటు ఆందోళనకు విరమణ ఇవ్వాలని వేర్పాటువాదులు నిర్ణయించుకోవడంతో శ్రీనగర్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పాఠశాలలను, దుకాణాలను, వాణిజ్య సంస్థలను, కార్యాలయాలను మంగళవారంనాడు తెరిచారు. వాహనాలు తిరిగాయి. కాశ్మీర్ లోయలో జరిగిన అల్లర్లలో దాదాపు 22 మంది మరణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+