చిరంజీవి స్వార్థపరుడు: జెసి
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి స్వార్థపరుడని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిస్వార్థ సేవాపరాయణులైన గాంధీ, మదర్ థెరిస్సా, అంబేడ్కర్, ఫూలే తనకు ఆదర్శమంటున్న చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం సరి కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆ మహానుభావులు ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన కూడా చేయలేదని, చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెపుతున్నారని ఆయన అన్నారు.
అధికారం కోసమే చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. ఆ మహానుభావులు తనకు స్ఫూర్తి అని చెబుతున్న చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేయబోనని అని ఉంటే తాను హాట్సాఫ్ అని ఉండేవాడినని ఆయన అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న చిరంజీవి ఆ మహానుభావులను స్ఫూర్తి ప్రదాతలుగా చెప్పుకోవడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
