పాక్ లో బాంబు పేలి 20 మంది మృతి
పెషావర్: పాకిస్తాన్ లోని పెషావర్ లోని ఒక ఆస్పత్రిలో బాంబు పేలి మంగళవారం 20 మంది దాకా మరణించారు. ఈ విషయాన్ని ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు. అది ఆత్మాహుతి దాడా, కాదా అనే విషయం చెప్పలేమని ఆయన అన్నారు. బాంబు ఆస్పత్రి ఆవరణలో పేలిన మాట మాత్రం వాస్తవమని సయ్యద్ మోహిసిన్ షా చెప్పారు. ఈ ఘటనలో 20 మంది మరణించినట్లు సమాచారం అందిందని ఆయన చెప్పారు.
ఆస్పత్రి వెలుపల ప్రదర్శన నిర్వహిస్తుండగా ఈ బాంబు పేలింది. ఓ ముస్లిం నాయకుడికి మద్దతుగా వారు ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ నాయకుడు మంగళవారం ఉదయం కాల్పుల్లో మృతి చెందాడు. అతని భౌతిక కాయాన్ని ఈ ఆస్పత్రికి తెచ్చారు.












Click it and Unblock the Notifications
