చిరంజీవి పార్టీలో భూమా దంపతులు

Bhooma Nagireddy
హైదరాబాద్: భూమా దంపతులు బుధవారం చిరంజీవి పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన భూమా నాగిరెడ్డి, ఆయన సతీమణి శోభా నాగిరెడ్డి జూబిలీహిల్స్ లోని చిరంజీవిని కలిసి ఆయన పార్టీలో చేరారు. రాయలసీమ రాజకీయ సంస్కృతిలో పెను మార్పులు తేవాలనే లక్ష్యంలో వారు తనకు చేదోడు వాదోడుగా నిలబడడానికి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చిరంజీవి మీడియా ప్రతినిధులతో చెప్పారు. భూమా దంపతులది సుదీర్ఘ రాజకీయ ప్రయాణమని, తన లక్ష్యాలు నచ్చి వారు తన పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారని తనకు చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో వచ్చిన తన లక్ష్యాలు తనకు నచ్చి వారు తనతో కలిసి పని చేయడానికి ముందుకు వచ్చారని ఆయన అన్నారు.

తన ఆదర్శమూర్తుల్లో ఎన్టీఆర్ కూడా ఉన్నారని చిరంజీవి చెప్పారని, ఎన్టీఆర్ తో తమ రాజకీయ జీవితం ప్రారంభమైందని, చిరంజీవి పార్టీలో చేరడానికి అదొక కారణమని భూమా నాగిరెడ్డి అన్నారు. పేదలకు మేలు చేయాలనే ముందుకు వచ్చిన చిరంజీవి పార్టీలో తాను సాధారణ కార్యకర్తగా పని చేస్తానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+