హైదరాబాద్: ఈ నెల 22న తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు ఎవ్వరూ హైదరాబాదాకు రావద్దని చిరంజీవి ఆయన అభిమానులనుకు వినతి చేసారు. ఈ సారి పుట్టిన రోజున తల్లి కోరిక మేరకు కుటుంబసభ్యులతోనే గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.మంగళవారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ తన పుట్టిన రోజు శుభాకాంక్షలను అభిమానులు పేదలకు సహాయ కార్యక్రమాలు చేయటం ద్వారా తెలిపమని చెప్పారు.