చిరుతో కాంగ్రెసుకు మేలు: జైపాల్
హైదరాబాద్: చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం వల్ల కాంగ్రెసుకు మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చిరంజీవి గణనీయమైన శక్తిగా ఎదుగుతారని ఆయన అన్నారు.
చిరంజీవి రావడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని, దీనివల్ల కాంగ్రెసుకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు ప్రతిపక్షాల మధ్య చీలిపోతారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
