చిరుపై నివేదిక రానీయండి: ఏచూరి
హైదరాబాద్: చిరంజీవి రాజకీయ పార్టీ పట్ల అనుసరించాల్సిన వైఖరిపై తమ రాష్ట్ర కమిటీ నివేదికలు వచ్చాక స్పందిస్తామని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. చిరంజీవి రాజకీయ పార్టీ ప్రభావంపై తాము రాష్ట్ర కమిటీ నివేదిక కోరామని, అది వచ్చిన తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. బిజెపి నాయకులు చిరంజీవితో సంప్రదిస్తున్న విషయాన్ని గుర్తు చేయగా రాష్ట్ర కమిటీ నివేదిక రానీయండి అని ఆయన అన్నారు.
కొత్త రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు మార్పు రావడం సహజమని ఆయన అన్నారు. నటులు రాజకీయాల్లోకి రావడం కొత్త విషయమేమీ కాదని, చాలా కాలంగా ఉన్నదేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
