సార్వత్రిక సమ్మెకు మిశ్రమ స్పందన
న్యూఢిల్లీ: వామపక్షాల పిలుపు మేరకు బుధవారం జరిగిన సార్వత్రిక సమ్మెకు మిశ్రమ స్పందన లభించింది. పశ్చిమ బెంగాల్, కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో బంద్ ప్రభావం సంపూర్ణంగా కనిపించింది. కోల్ కత్తా నుంచి బయలుదేరాల్సిన విమానాలన్నీ ఆగిపోయాయి. కేంద్రప్రభుత్వ విధానాలకు, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఈ సమ్మె జరిగింది. కోల్ కత్తాలో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. త్రిపుర రాజధాని అగర్తాలలో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. సమ్మె సందర్భంగా ఆందోళనకారులు ప్రదర్శనలు ర్యాలీలు నిర్వహించారు. పలు చోట్ల ట్రాఫిక్ ను అడ్డుకున్నారు. రైళ్ల రాకపోకలను కూడా అడ్డుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించింది. హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరిగాయి. ఆందోళనకారులు ట్రాఫిక్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. విశాఖపట్నంలో సమ్మె ప్రభావం పాక్షికంగా కనిపించింది. హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications
