పాక్ లోనే వుంటా: ముషార్రఫ్
ఇస్లామాబాద్: తాను పాకిస్తాన్ వదిలిపెట్టి పోతున్నట్లు వచ్చిన వార్తలను మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ ఖండించారు. తాను పాకిస్తాన్ ను వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, తాను పాకిస్తాన్ లోనే ఉంటానని ఆయన చెప్పారు. రాజీనామా చేసినంత మాత్రాన తాను ఓడిపోయినట్లు కాదని ఆయన అన్నారు.
పాకిస్తాన్ దేశం ప్రయోజనాల కోసం, ప్రజల మేలు కోసం మాత్రమే తాను రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. తనను కలిసిన పలువురు ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు చెప్పినట్లు జియె న్యూస్ చానెల్ వార్తలు ప్రసారం చేసింది. పాకిస్తాన్ అంటే తనకెంతో ప్రేమ అని, అందువల్ల దేశాన్ని వీడి వెళ్లే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితిపై తాను త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేస్తానని ఆయన చెప్పారు. తన కుమారుడు వాణిజ్యం చేస్తున్నందున తాను అమెరికా వెళ్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. తాను మక్కాకు వెళ్లి వస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
