పాక్ లో రెండు బాంబు పేలుళ్ళు ...15మంది మృతి
ఇస్లామాబాద్: వరసగా జరుగుతున్న బాంబు పేలుళ్ళతో పాకిస్ధాన్ ప్రజలకు కంటి మీద కునుకు కరవైంది. రెండు రోజుల క్రితం జరిగిన ఆత్మాహుతి దాడితో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు కూడా ఇస్లామాబాద్ సమీపంలోని వాహ్ కంటోన్మెంట్ ప్రాంతంలో రెండు బాబు పేలుళ్ళు జరిగాయి. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మంది కి గాయాలయ్యాయి. రావుల్పిండి కంటోన్మెంట్ ప్రాంతంలోని ఆర్డినెన్స్ ఫాక్టరీ బయిట ఇద్దరు వ్యక్తుల ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో చాలామంది అక్కడకక్కడే నేలకొరిగారని ప్రత్యక్ష్య సాక్షుల కథనం.












Click it and Unblock the Notifications
