చిరు సభకు అనంత నుంచి భారీ స్పందన!

చిరు సభకు తిరుపతికి ఎన్ని వాహనాలు బయలుదేరుతున్నాయో ఆ వివరాలను చిరంజీవి పార్టీ కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపించాలని చిరంజీవి సలహాదారు రాము యాదవ్ చెప్పారు. అనంతపురం జిల్లా నుంచి చిరు సభకు సంబంధించి జన సమీకరణ వివరాలు తెలుసుకోడానికి యాదవ్ ఇక్కడకు బుధవారం వచ్చారు. చిరంజీవి సభకు దాదాపు 10లక్షల మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో ప్రముఖ నాయకులకు మాత్రమే పాసులను జారీ చేస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి దాదాపు రెండువేల వాహనాలు తిరుపతికి బయలుదేరుతాయని నిర్వాహకులు ఒక అంచనాకు వచ్చారు.












Click it and Unblock the Notifications
