స్పెయిన్: స్పెయిన్ లోని మాడ్రిడ్ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 153 మంది ప్రయాణీకులు సజీవ దహనం అయ్యారు. కానరీ ద్వీపానికి వెళుతున్న ఈ జెట్ విమానం టేకాఫ్ తీసుకోగానే కూలిపోయింది. రన్ వే ను గుద్దుకుని మంటలు చెలరేగి విమానంలోని వారు సజీవదహనం అయ్యారు. కేవలం 19 మంది మాత్రమే ప్రాణాలతో బయిటపడినా వారి పరిస్ధితీ విషమంగానే ఉంది. గత పాతికేళ్ళలో ఎప్పుడూ స్పెయిన్ లో ఇంత ఘోర ప్రమాదం జరగలేదు.