హైదరాబాద్: ప్రముఖ సినీ నటి జయసుధ బుధవారం స్వల్ప అస్వస్ధతకు గురయ్యారు. నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న కొత్త బంగారు లోకం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుండగా ఇది చోటుచేసుకుంది. షూటింగ్ లో ఉండగా ఆమె హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోవటంతో ఆమెను కామినేని హాస్పటిల్ కి తరలించారు. అక్కడ న్యూరో ఫిజీషియన్ శ్రీకాంత్ రెడ్డి వైద్య పరీక్షలు నిర్వహించి...అనంతరం ఆమెను ఇంటికి పంపించేసారు.