భార్యను కాల్చి చంపిన ఎన్నారై
వాంకోవర్: కెనడాలోని సర్రీ పట్టణంలో ఎన్నారై ఒకరు భార్యను హత్య చేసారు. అక్కడ టాక్సీ నడుపుతున్న హర్ పాల్ జీత్ సింగ్ సంధు(53)తన భార్య మంజీత్ (45) ను కాల్చి చంపాడు. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న గొడవలే ఈ ఘాతుకానికి ప్రేరేపించినట్లు తెలుస్తోంది . సంధు కూతురు సబ్రనా (23) కూడా ఈ ఘటనలో గాయపడింది. సంధు కుమారులు మనరాజ్ (19),సుఖ్ మాన్ (12) సురక్షితంగా బయటపడ్డారు.
బుధవారం సంధును కోర్టులో హాజరు పరిచారు. హత్య,హత్యాయత్నం క్రింద అతనిపై కేసు నమోదు చేశారు. వరసగా చోటు చేసుకుంటున్న ఇటువంటి సంఘటనలపై ప్రవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
