చిరు సభకు సుప్రీం ఓకె

Chiranjeevi
న్యూడిల్లీ :సినీనటుడు చిరంజీవి తిరుపతిలో ఏర్పాటు చేయనున్న తొలి బహిరంగ సభకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతిలోని అవిలాలలో చెరువులో ఏర్పాటు చేస్తున్న ఈ సభను అడ్డుకోవాలని మేధావుల ఫోరం సుప్రీం కోర్టులో పిటీషన్ వేసింది. ఈ ఫిటీషన్ పై గురువారం విచారించిన సుప్రీంకోర్టు చిరు సభను యధాతథంగా నిర్వహించటానికి అనుమతినిచ్చింది. పిటీషన్ పై తదుపరి విచారణను వాయిదా వేసింది. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన సందర్భంగా ఈ నెల 26న సభను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈనెల 26 న తిరుపతిలో బహిరంగ సభ పెట్టుకోడానికి ఎంపిక చేసిన స్ధలంలో సభ జరుగకుండా స్టే ఇవ్వాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. తిరుపతికి చెందిన మేధావుల వేదిక తరఫున జి రామకృష్ణ ప్రసాద్ అనే న్యాయవాది ఈ పిటిషన్ వేశారు.చిరంజీవి పార్టీ బహిరంగ సభ తిరుపతిలోని అవిలాల చెరు ఏరియాలో జరుగనుంది. అయితే ఈ ప్రాంతంలో బహిరంగ సభలు నిర్వహించరాదని హైకోర్టు గతంలో ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+