మృతి చెందిన ఎమ్మెల్యేలకు సంతాపం
హైదరాబాద్: మృతి చెందిన శాసనసభ్యులకు సోమవారం శాసనసభ సంతాపం ప్రకటిస్తూ తీర్మానం చేసింది. శాసనసభ్యులు శిఖామణి, చనుమోలు వెంకట్రావుల మృతికి సభ సంతాపం ప్రకటించింది. శాసనసభ వర్షాకాలం సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. వచ్చేనెల 6వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. పది రోజుల పాటు సభ సమావేశమవుతుంది.
మృతి చెందిన శాసనసభ్యులకు సంతాపం ప్రకటిస్తూ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించారు. శిఖామణి, చనుమోలు వెంకట్రావు చేసిన సేవలను ఆయన తన సంతాప తీర్మానంలో కొనియాడారు. ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు సహా ప్రతిపక్షాల సభ్యులు మృతి చెందిన సభ్యులకు సంతాపం వ్యక్తం చేస్తూ వారు చేసిన సేవలను కొనియాడారు.












Click it and Unblock the Notifications
