సిమిపై ఆరు వారాల నిషేధం: సుప్రీం
న్యూఢిల్లీ: సిమిపై నిషేదాన్ని ఎత్తివేయాలనే ప్రత్యేక ట్రిబ్యునల్ నిర్ణయంపై ఆరు వారాల పాటు స్టే విధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సిమిపై సుప్రీంకోర్టు మరో ఆరు వారాల పాటు సెప్టెంబర్ 24వ తేదీ వరకు నిషేధం కొనసాగుతుంది. ఈ కేసు విచారణను ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది.
సిమిపై నిషేధాన్ని ఎత్తివేయాలనే జస్టిస్ గీతా మిట్టల్ నేతృత్వంలోని ప్రత్యేక ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మతఛాందస సంస్థ సిమి శాంతికి, సమగ్రతకు, లౌకికతత్వానికి సవాల్ గా మారిందని కేంద్రం కోర్టులో వాదించింది.












Click it and Unblock the Notifications
