చిరు ఎఫెక్ట్: కాపులకు తాయిలం
హైదరాబాద్: కాపు, ఒంటరి, తెలగ, బలిజ కులాల విద్యార్థులకు వెనకబడిన తరగతుల (బిసి) విద్యార్థులకు ఇచ్చే ఉపకారవేతనాలను ఇవ్వడానికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అంగీకరించారు. ఈ విషయంలో మంత్రులు బొత్సా సత్యనారాయణ, కన్నా లక్ష్మినారాయణ చేసిన వినతిని ముఖ్యమంత్రి అంగీకరించారు. చిరంజీవి రాజకీయ ప్రవేశం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది. చిరంజీవికి ఆ కులాల్లో ఆదరణ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో వారిని తమ వైపు తిప్పుకోవడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
కాపు విద్యార్థులకు బిసి విద్యార్థులతో సమానంగా స్కాలర్ షిప్ లు ఇవ్వాలనేది ఇప్పటి నిర్ణయం కాదని, ప్రభుత్వం నాలుగేళ్ల క్రితమే ఈ నిర్ణయం తీసుకుందని, అప్పుడు చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారనే ఊసు కూడా లేదని మంత్రి కన్నా లక్ష్మినారాయణ అన్నారు. బిసిలకు కల్పించే సదుపాయాలు కాపులకు కల్పించాలనే ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
