ప్రియురాలిపై ప్రేమోన్మాది ఘాతుకం
గుంటూరు: గుంటూరు జిల్లా గురజాలలో సోమవారం ఒక ప్రేమోన్మాది తీవ్ర ఘాతుకానికి పాల్పడ్డాడు. అతను ప్రియురాలి గొంతు కోశాడు. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు చెప్పారు. తలపై, ముక్కుపై, మెడపై ఆమెకు గాయాలయ్యాయి. పరిగి నర్సింహారావు అనే యువకుడు కాటూరి కళ్యాణి అనే తన ప్రియురాలిపై కొడవలితో దాడి చేశాడు. దీంతో అమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
కళ్యాణి హైదరాబాదులో ఎంసిఎ సెకిండియర్ చదువుతోంది. నర్సింహారావు కూడా హైదరాబాదులోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరు గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల వారిద్దరి మధ్య కలతలు చోటు చేసుకున్నాయి. కళ్యాణి తన చెల్లెలి పెళ్లి కోసం గురజాల వచ్చింది. చెల్లెలి పెళ్లి చూడకూడదనే సెంటిమెంట్ తో ఆమె కళ్యాణమండపం పక్కన ఉంది. ఇది గమనించి నర్సింహారావు ఆమెపై దాడి చేశాడు. తమ కూతురు ప్రేమించడం లేదని చెప్పినా నర్సింహారావు వేధిస్తున్నాడని కళ్యాణి తల్లి అంటోంది. నర్సింహారావు కళ్యాణిపై దాడి చేసిన వెంటనే పారిపోయాడు.












Click it and Unblock the Notifications
