హైదరాబాద్: చిరంజీవి పార్టీ వల్ల తమ పార్టీకి లాభమే జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణరావు అన్నారు. చిరంజీవి పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీ ఓట్లు చీలిపోయి తమ పార్టీకి లాభం జరగుతుందని ఆయన సోమవారం శాసనసభ ఆవరణలో మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ అంశం అలాగే ఉంటే తమకు మాట్లాడడానికి అవకాశం ఉంటుందని, అందువల్ల తెలంగాణ అలాగే ఉంటుందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణ ఇప్పట్లో రాకపోవచ్చునని ఆయన అన్నారు.