నీలోఫర్ లో బాలుడి మృతి: ఆందోళన
హైదరాబాద్: హైదరాబాద్ లోని నీలోఫర్ అస్పత్రిలో ఒక బాలుడి మృతి సోమవారం ఉద్రిక్తతకు దారి తీసింది. కరీంనగర్ జిల్లాకు చెందిన తమ బాలుడు వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మరణించాడని బాలుడి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ కారణంగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. రాత్రి నుంచి ఇప్పటి వరకు 8 మంది పిల్లలు మరణించారని వారంటున్నారు. బాలుడి మృతికి సంబంధించి తమ తప్పేమీ లేదని వైద్యులంటున్నారు.
గతంలో కూడా నీలోఫర్ ఆస్పత్రిలో పిల్లల మృతిపై ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. నీలోఫర్ ఆస్పత్రిలో పిల్లలు మరణించడం పరిపాటి అయింది. అయితే చివరి నిమిషంలో తమ పిల్లలను తల్లిదండ్రులు నీలోఫర్ కు తీసుకు వస్తారని, దీనివల్ల మరణాలు సంభవించడం సర్వసాధారణమని, ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఏదీ ఉండదని నిపుణులు వాదిస్తున్నారు.












Click it and Unblock the Notifications
