తిరుపతి: చిరంజీవి తిరుపతి బహిరంగ సభలో సాంస్కృతిర కార్యక్రమాలు ప్రదర్శన ఉంటుంది. వీటికి పనన్ కళ్యాణ్ రూపకల్పన చేశారు. పవన్ కళ్యాణ్ చిరంజీవి రక్షణ బాధ్యతలు కూడ చూస్తున్నారు. తిరుపతిలోని అవిలాల మైదానంలో అల్లు అరవింద్ తో పాటు నాగేంద్ర బాబు, పవన్ కళ్యాణ్, సీనియర్ నాయకులు హరిరామజోగయ్య, కోటగిరి విద్యాధర్రావు, డాక్టర్ మిత్రా పర్యవేక్షిస్తున్నారు. చిరంజీవి సోమవారం సాయంత్రమే తిరుపతి చేరుకుంటారు. రేపు ఉదయం తిరుమలేశుని సందర్శించుకుంటారు. సాయంత్రం బహిరంగసభ జరుగుతుంది. మైదానంలో ౭౦ ఎల్సీడి స్క్రీన్ లను ఏర్పాటు చేస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా బహిరంగ సభను చిత్రీకరించే ఏర్పాట్లు జరిగాయి.