కాశ్మీర్ కాల్పులు: ముగ్గురు మృతి
శ్రీనగర్: కాశ్మీర్ లోయ మళ్లీ భగ్గుమంది. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి ఆందోళనకారులు హింసాత్మక చర్యలకు దిగడంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. 70 మందికి పైగా గాయపడ్డారు. రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులపై భద్రతాధికారులు కాల్పులు జరపడంతో నార్బల్ లో షౌకత్ అహ్మద్ ఖాండే అని యువకుడు మరణించగా, మరో యువకుడు గాయపడ్డాడు. పుల్వామా పట్టణంలో ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలో బాసిత్ బషీర్ అనే యువకుడు మరణించాడు. బుల్లెట్ గాయాలతో మరో నలుగురు ఆస్పత్రి పాలయ్యారు.
కుప్వారాకు చెందిన చూటిపొరా గ్రామంలో భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో 18 ఏళ్ల బాలిక ఫెహ్మీదా మృతి చెందింది. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఆదివారం నుంచి జరుగుతున్న సంఘటనల్లో నలుగురు మరణించారు. 110 మందికిపైగా గాయపడ్డారు. ఆదివారంనుంచి శ్రీనగర్ లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఆదివారంనాడు ఒక వ్యక్తి మరణించాడు.












Click it and Unblock the Notifications
