స్పీకర్ విందు: నల్ల దుస్తుల్లో కిషన్
హైదరాబాద్: శాసనసభ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి సోమవారం ఇచ్చిన అల్పాహార విందుకు బిజెపి శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి నల్ల దుస్తుల్లో హాజరయ్యారు. శాసనసభ వర్షాకాలం సమావేశాల సందర్భంగా స్పీకర్ ఈ విందు ఇచ్చారు. హైదరాబాదులో జరిగిన జంట పేలుళ్ల కేసులో ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ కిషన్ రెడ్డి నల్లదుస్తుల్లో వచ్చారు. హైదరాబాదులోని గోకుల్ చాట్, లుంబినీ పార్కుల్లో పేలుళ్లు సంభవించి నేడు సోమవారానికి ఏడాది అవుతోంది.
స్పీకర్ ఇచ్చిన విందుకు ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు హాజరు కాలేదు. తెలుగుదేశం పార్టీ తరఫున కళా వెంకట్రావు ఈ విందుకు వచ్చారు. సిపిఐ శాసనసభా పక్ష నేత చాడ వెంకటరెడ్డి, సిపిఎం శాసనసభా పక్ష నేత నోముల నర్సింహయ్య ఈ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో ముచ్చట్లు పెట్టారు. ఈ విందుకు మంత్రులు, శాసనసభ్యులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications
