అసెంబ్లీ వరకు టిడిపి పాదయాత్ర
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు నిరసనగా నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో సోమవారం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పాదయాత్ర చేస్తూ శాసనసభకు చేరుకున్నారు. ఎన్టీఆర్ గార్డెన్ నుంచి శాసనసభ వరకు పాదయాత్ర నిర్వహించారు. స్వర్గీయ ఎన్.టి. రామారావు సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించి పాదయాత్ర మొదలు పెట్టారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ పాదయాత్ర నిర్వహించినట్లు చంద్రబాబు చెప్పారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పేదల, బిసిల, మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఇది రైతుల వ్యతిరేక ప్రభుత్వమని ఆయన అన్నారు. నిత్యావసర సరకుల ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. అవినీతిలో ప్రభుత్వం కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ, సిపిఎం శాసనసభ్యులు కూడా పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి శాసనసభ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం చంద్రబాబు ప్రతిపక్ష శాసనసభ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వామపక్షాల సభ్యులతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
