టిటిడి పాలక సభ్యుల నియామకం
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలకమండలి సభ్యులను ప్రభుత్వం సోమవారంనాడు నియమించింది. కరుణాకర్ రెడ్డి స్థానంలో ఇప్పటికే ఆదికేశవులునాయుడును టిటిడి చైర్మన్ గా నియమించారు. బలపరీక్ష సందర్భంగా యుపిఎకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణపై పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఆదికేశవులు నాయుడును పార్టీ నుంచి తెలుగుదేశం బహిష్కరించింది. ఆ తర్వాత ఆయన చిరంజీవి పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం టిటిడి చైర్మన్ గా నియమించింది. ఆయన సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తారు.
కాగా, పెన్మెత్స సాంబశివరాజు, రాజశేఖర్, మందలపు అంజయ్య, ఇందిర, కాలె యాదయ్య, అల్లూరి సుబ్రహ్మణ్యం, ఆర్పీ గోయెంకా, విజయసాయి రెడ్డి, సిహెచ్. సత్యనారాయణ టిటిడి పాలక మండలి సభ్యులుగా నియమితులయ్యారు. ఈ పాలక మండలి పదవీ కాల పరిమితి రెండేళ్లు.












Click it and Unblock the Notifications
