గుంటలో మునిగి ఇద్దరు పిల్లల మృతి

హైదరాబాద్: హైదరాబాదులోని ఐమాక్స్ థియేటర్ వద్ద గల నీటి గుంటలో పడి సోమవారం ఇద్దరు పిల్లలు మరణించారు. ఈతకని వెళ్లిన నలుగురు పిల్లల్లో ఇద్దరు మరణించారు. ఇక్కడ బోటింగ్ పార్కు ఏర్పాటు కోసం పనులు జరుగుతున్నాయి. దీనికి గుంటలు తవ్వారు. ఈ గుంటల్లో ఈత కొట్టడానికి పిల్లలు దిగారు. అయితే గుంట లోతుగా ఉండడంతో వారు మునిగిపోయి మరణించారు. వారికి ఈత రాకపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. కులీ కుతుబ్ షా మసీదు పాఠశాలలో వీరు చదువుతున్నారు.

పాఠశాలకు వెళ్తూ పిల్లలు ఈ గుంటల్లోకి దిగారు. చుట్టూ కంచె లేకపోవడంతో ఈ ప్రమాదం సంభవించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మృతులను సాల్మన్, అయేష్ లుగా గుర్తించారు. ఇద్దరు పిల్లలు మునిగిపోవడంతో మరో ఇద్దరు పిల్లలు పారిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+