చిరుకు స్పష్టత లేదు: బిజెపి
హైదరాబాద్: తెలంగాణపై ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక నేత చిరంజీవికి స్పష్టత లేదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు సిహెచ్. విద్యాసాగరరావు అన్నారు. తెలంగాణపై ప్రజాభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామని అనడం మరింత గందరగోళానికి తావిస్తోందని ఆయన బుధారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చిరంజీవి వెనక ఉన్న మేధావులు ఆయనను తప్పు దోవ పట్టించే అవకాశం ఉందని విద్యాసాగరరావు అన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అనడానికి నిన్నటి చిరంజీవి సభనే నిదర్శనమని ఆయన అన్నారు.
చిరంజీవి తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తిస్తామని అనడం స్వాగతించదగ్గదని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటులో చిరంజీవి క్రియాశీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. బిజెపి ద్వారానే తెలంగామ వస్తుందని ప్రజలు నమ్ముతున్నారని ఆయన అన్నారు. త్వరలోనే పార్లమెంటు, శాసనసభ సీట్లకు పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ జవేదకర్ చెప్పారు.












Click it and Unblock the Notifications
