హైదరాబాద్: చిరంజీవి ప్రసంగంలో పస లేదని రాష్ట్ర మంత్రులు జీవన్‌రెడ్డి, రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కీలకాంశాలపై ఆయనకు స్పష్టత లేదని... కొత్త విషయాలేం చెప్పలేదని అన్నారు. సమాజంలో ఉన్న విషయాలు చెప్పటం వల్ల ఏం ప్రయోజనమని, అవి అందరికీ తెలిసినవేనని వారు అన్నారు. వాటి పరిష్కారానికి తానేం చేసేది ఒక్క అంశంపై కూడా స్పష్టంగా చెప్పలేదన్నారు. ఆయన ప్రసంగం బాక్సాఫీసువద్ద పల్టీ కొట్టిన చిత్రంలా ఉందని జీవన్‌రెడ్డి అన్నారు.