మిలిటెంట్ల కాల్పుల్లో 5గురు మృతి
జమ్ము: జమ్ములో ముగ్గురు మిలిటెంట్లు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. మృతుల్లో నలుగురు పౌరులు, ఒక జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ ఉన్నారు. ఈ సంఘటన బుధవారం ఉదయం 5 గంటల 45 నిమిషాల ప్రాంతంలో జమ్మూలోని మిశ్రివాలా ప్రాంతంలో జరిగింది. ఎదురుకాల్పుల్లో ఒక మిలిటెంట్ మరణించాడు. నలుగురు పిల్లలతో కూడిన ఆరుగురు కుటుంబ సభ్యులను మిలిటెంట్లు బందీలుగా తీసికెళ్లారు. దీంతో మిలిటెంట్లకు, సైనికులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు పాల్గొంటున్నారు.
డ్రైవర్ ను హత్య చేసి ముగ్గురు మిలిటెంట్లు ఆటో రిక్షాలో పారిపోతున్నట్లు సమాచారం. చినోర్ ప్రాంతంలో ఒక ఇంటిలో ఉన్న మిలిటెంట్లను సైనికులు చుట్టుముట్టినట్లు, దాంతో మిలిటెంట్లు ఆటో రిక్షాలో పారిపోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. వీరు ముగ్గురు మంగళవారం ఆక్నూర్ సెక్టార్ లో భారత భూభాగంలోకి ప్రవేశించారు.












Click it and Unblock the Notifications
