తిరుపతి: ప్రజారాజ్యం వ్యవస్థాపక నేత, మెగాస్టార్ చిరంజీవి బహిరంగ సభ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది. మరో ముప్పయి ఐదు మంది దాకా గాయపడ్డారు. వేలాది మంది చిరంజీవి అభిమానులు వేదిక వైపు తోసుకుని రావడంతో ఈ దుర్షటన చేటుచేసుకుంది. తమ అభిమాన నటుడి చెంతకు చేరుకోవడానికి వేలాది మంది బారికేడ్లను తోసుకుని రావడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దాంతో తొక్కిసలాట జరిగింది. సౌకర్యాలు సరిగా కల్పించకపోవడం పట్ల కొంత మంది నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స చేయించారు. వేదికపై నుంచి దిగి వెళ్లిపోయే సమయంలో అభిమానులు తోసుకుని రావడంతో చిరంజీవి కూడా తూలి కింద పడ్డారు. అభిమానులను అదుపు చేయడం చాలా కష్షంగా మారింది.