స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం నోటీసు

హైదరాబాద్: శాసనసభ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అవిశ్వాస తీర్మానం నోటీసులను ఇచ్చాయి. తమ నోటీసులను ఈ రెండు పార్టీలు బుధవారం శాసనసభ సచివాలయ కార్యదర్శి తుల్జానంద్ సింగ్ కు బుధవారం నాడు అందజేశాయి. తెలుగుదేశం పార్టీ తరఫున నాగం జనార్దన్ రెడ్డి ఆ నోటీసు ఇచ్చారు. శాసనసభ చరిత్రలో స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం ఇదే తొలిసారి. శాసనసభ చరిత్రలో స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం రాలేదని, స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాల్సిన పరిస్థితులు రావడం బాధాకరంగా ఉందని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. చట్టసభలోనే చట్టాన్ని ఖూనీ చేసే వాతావరణం ఏర్పడిందని, అందువల్ల స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం తేవడం తప్పడం లేదని ఆయన అన్నారు.

తాము అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడానికి తెరాస మరో కారణం చెబుతోంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయడంలో స్పీకర్ విఫలమయ్యారని, అందుకే తాము విశ్వాస తీర్మానాన్ని ప్రతిపదిస్తున్నామని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు చెప్పారు.

ఇదిలా ఉంటే, తమ శాసనసభ్యుడు కరణం బలరాం చేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు దీక్ష విరమింపజేశారు. తనను ఆరు నెలల పాటు శాససనభ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కరణం బలరాం సభ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగారు. ప్రభుత్వ తీరుపై ప్రజల్లోకి వెళ్తామని చంద్రబాబు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+