దుబాయ్ లో 10 మంది ఆంధ్రుల మృతి
హైదరాబాద్: దుబాయ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పది మంది తెలుగువాళ్లు మరణించారు. ఈ ప్రమాదంలో మొత్తం 20 మంది చనిపోయారు. వీరిలో పది మంది తెలుగు వాళ్లు. వీరంతా కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందినవారని సమాచారం. వీరిలో 9 మంది కరీంనగర్ జిల్లాలోని మల్లాపూర్, మెట్ పల్లి మండలాలకు చెందివారు. మరొకరు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి.
గదికి నిప్పంటుకోవడంతో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. గదిలో 16 మంది ఉన్నారని, ఇందులో పది మంది చనిపోగా, ఆరుగురు ప్రమాదం నుంచి బయటపడినట్లు ఇక్కడికి సమాచారం అందింది. అయితే అధికారిక సమాచారం ఇప్పటి వరకు అందుబాటులో లేదు. అధికారుల నుంచి ఈ విషయంలో ఎటువంటి స్పందన లేదని తెలుస్తోంది. ప్రమాదం సర్క్యూట్ వల్ల సంభవించిందా, మరో కారణం వల్లనా అనేది ఇంకా తేలలేదు. మృతులంతా కూలీలే. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి దుబాయ్ వంటి దేశాల్లో కూలీ పనులకు పెద్ద యెత్తున వలసలు పోయారు.












Click it and Unblock the Notifications
