ప్రభుత్వ వైద్యుల సమ్మె విరమణ
హైదరాబాద్: తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులు సోమవారం మధ్యాహ్నం సమ్మె విరమించారు. సంబంధిత మంత్రి సంభాని చంద్రశేఖర్ కి, వైద్యుల ప్రతినిధులకు జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో వైద్యులు సమ్మె విరమించారు. ప్రభుత్వ డిమాండ్లకు పరిష్కరిస్తూ వారం లోగా ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ నెల 8వ తేదీ లోగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయకపోతే తిరిగి ఆందోళనకు దిగుతామని వైద్యులు చెప్పారు.
అంతకు ముందు వైద్యులు సామూహిక సెలవు పెట్టి ఆందోళనకు దిగారు. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. హైదరాబాదులో వైద్యులు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు.












Click it and Unblock the Notifications
