కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు
హైదరాబాద్: అంతర్రాష్ట్ర కిడ్ని రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ రాకెట్ లో కార్పోరేట్ అస్పత్రుల పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యశోద, మెడ్విన్, అపోలో, సిడిఆర్, సాయివాణి, సత్య కిడ్ని సెంటర్ వంటి కార్పోరేట్ ఆస్పత్రులు పాత్ర ఉందని పోలీసులు అంటున్నారు.
శస్త్ర చికిత్స నిమిత్తం వచ్చిన రోగులకు ఆపరేషన్ చేసి కిడ్నీలు తొలగించి దాచేస్తున్నారని, వాటిని విదేశాలకు కూడా అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయని పోలీసులు అంటున్నారు. కొంత మంది రోగులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.












Click it and Unblock the Notifications
