ప్రభుత్వ వైద్యుల సామూహిక సెలవు
హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు సోమవారం సామూహిక సెలవు పెట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించినందుకు నిరసనగా వారు ఈ సెలవు పెట్టారు. దీని నుంచి అత్యవసరసేవలను మినహాయించారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఔట్ పేషెంట్, ఆపరేషన్ థియేటర్ల విభాగాలు పూర్తిగా స్తంభించాయి.
తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు ఆదివారం వరకు నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే ప్రభుత్వం దిగిరాకపోవడంతో వారు సామూహిక సెలవులు పెట్టారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తమకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని వారు విమర్శించారు. విశాఖపట్నంలోని కెజిహెచ్, వరంగల్ లోని ఎంజిఎం, హైదరాబాదులోని ఉస్మానియా, గాంధీ అస్పత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర విఘాతం కలిగింది. సామూహిక సెలవు పెట్టిన వైద్యులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
